గాలి ప్రసరణ సరిగా లేకుంటే కరోనాను కొనితెచ్చుకున్నట్టే.. యూకే యూనివర్సిటీ అధ్యయనం
- గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి
- తుమ్ము, దగ్గు ద్వారా వచ్చే సూక్ష్మ బిందువుల్లోని వైరస్ లక్షణాలు అలానే ఉంటాయి
- సర్రే యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
ప్రస్తుతం ప్రతి చోట ఏసీలు ఉన్నప్పటికీ వాటి పనితీరు సక్రమంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని వివరించారు. కాబట్టి అన్ని గదుల్లోకి గాలి, వెలుతురు పూర్తిగా వచ్చేలా చూసుకోవాలని, లేకుంటే కరోనా ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్రపంచాన్ని కోవిడ్ భయపెడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాలని సూచించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఎన్విరాన్‌మెంట్ ఇంటరాక్షన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.