ED: అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం దర్యాప్తులో మరో కీలక పరిణామం

  • నిందితుడు రాజీవ్ సక్సేనాకు చెందిన ఆస్తుల జప్తు
  • రూ.385 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్
  • గతేడాది జనవరిలో అరెస్ట్ అయిన సక్సేనా
ED attaches accused Rajiv Saxena assets

కొన్నేళ్ల కిందట దేశాన్ని కుదిపేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా, ఈ కుంభకోణంతో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ సక్సేనాకు చెందిన రూ.385 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ చర్య తీసుకుంది.

ఇక ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో దుబాయ్ లోని పామ్ జుబేరా దీవిలోని విలాసవంతమైన భవనం, ఐదు స్విస్ బ్యాంక్ అకౌంట్లలోని నగదు ఉన్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ సక్సేనాను గతేడాది జనవరిలో మనీ లాండరింగ్ చట్టం కింద యూఏఈలో అరెస్ట్ చేశారు. అరెస్టయిన పిదప సక్సేనా అప్రూవర్ గా మారాడు. కాగా, ఇదే కుంభకోణంలో మరోవైపు సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది.

More Telugu News