హర్యానాలోని రోహ్ తక్ లో భూకంపం.... ఢిల్లీ పరిసరాలలో కంపించిన భూమి

29-05-2020 Fri 21:32
  • 4.6 తీవ్రతతో భూప్రకంపనలు
  • ఇటీవల ఢిల్లీలో తరచుగా ప్రకంపనలు
  • ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు
One more earthquake hits Delhi

గత కొన్నివారాలుగా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరోమారు ప్రకంపనలు రావడంతో ఢిల్లీ వాసులు హడలిపోయారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. భూకంప కేంద్రం హర్యానాలోని రోహ్ తక్ వద్ద ఉన్నట్టు గుర్తించారు. గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లోనూ భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.