Medical: జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం, పీజీ అడ్మిషన్లు చేపట్టలేం: ఏపీ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల నిర్వహణ సంఘం

  • మెడికల్ కాలేజీలు కరోనా ఆసుపత్రులుగా మారిపోయాయని వెల్లడి
  • పీజీ ఫీజులు 70 శాతం తగ్గించారని వివరణ
  • ఇలాంటి పరిస్థితుల్లో బోధనాసుపత్రులు నిర్వహించలేమని అశక్తత
Medical PG admissions halted in AP

రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కళాశాలలు కరోనా ఆసుపత్రులుగా మారిపోయాయని, ఆదాయం లేకపోవడంతో డాక్టర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఏపీ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల నిర్వహణ సంఘం వాపోయింది.

 ఫీజుల కంటే మెడికల్ విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ మొత్తమే అధికంగా ఉందని, పీజీ కోర్సుల ఫీజులు 70 శాతం తగ్గించారని, ఈ నేపథ్యంలో టీచింగ్ హాస్పిటళ్లను నడపడం శక్తికి మించిన పని అని సంఘం పేర్కొంది. అందుకే ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

More Telugu News