ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి, అశ్లీల వీడియోకు లైక్ కొట్టిన హ్యాకర్లు.. సోషల్ మీడియాను వదిలేసిన పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం

29-05-2020 Fri 21:01
  • వకార్ యూనిస్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
  • సోషల్ మీడియాతో తనకు చెడే ఎక్కువగా జరుగుతోందని ఆవేదన
  • ఇకపై సోషల్ మీడియాను వాడబోనని ప్రకటన
Waqar Younis quits social media

ఇకపై తాను సోషల్ మీడియాలో ఉండబోనని పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో తన చివరి వీడియోను పోస్ట్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని... ఓ అశ్లీల వీడియోను లైక్ చేశారని... ఇది తనపై, తన కుటుంబంపై దుష్ప్రభావాన్ని చూపుతోందని చెప్పారు. తన అకౌంట్ ను హ్యాక్ చేసి ఇలాంటి పనులు చేయడం ఇదే తొలిసారి కాదని అన్నారు. తన ట్విట్టర్ అకౌంట్ మరోసారి హ్యాక్ అయినట్టు ఈ ఉదయం నిద్ర లేచిన తర్వాత తనకు తెలిసిందని చెప్పారు.

మనం ఎంతో అభిమానించే వారితో అనుసంధానం కావడానికే సోషల్ మీడియా ఉందని... అయితే, దీని వల్ల తనకు చెడు ఎక్కువగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబం కూడా సిగ్గుపడే పరిస్థితులు తలెత్తుతున్నాయని... అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని తెలిపారు. ఇంకెప్పుడూ తాను సోషల్ మీడియాను వాడబోనని... అభిమానులు తనను క్షమించాలని కోరారు. తనకు అన్నింటికన్నా తన కుటుంబమే ముఖ్యమని చెప్పారు. ఇంకెప్పుడూ తనను సోషల్ మీడియాలో చూడలేరని తెలిపారు.