నవరత్నాలు తెచ్చి పోస్తానని చెప్పి, ఇప్పుడు 'నవరత్న' తైలంతో సరిపెట్టారు: నారా లోకేశ్

29-05-2020 Fri 20:42
  • ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నారు
  • షరతులు వర్తిస్తాయని ఇప్పుడు అంటున్నారు
  • నవరత్నాలు అని చెప్పి.. నవరత్న తైలంతో సరిపెట్టారు
Nara Lokesh releases video on Jagans one year rule

వైసీపీ పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు, జగన్ ఏడాది పాలనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై టీడీపీ నేత నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో విడుదల చేశారు.

'ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన జగన్ గారు గెలిచిన తరువాత 'షరతులు వర్తిస్తాయి' అంటూ మొహం చాటేశారు. నవరత్నాలు తెచ్చి పోస్తానని చెప్పి, ఇప్పుడు 'నవరత్న' తైలంతో సరిపెట్టారు. ఏడాది కాలంలో రద్దులు, భారాలు, మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు' అని ట్వీట్ చేశారు.