ఎవరైనా ప్రశంసిస్తే నాకు బద్ధకం పెరుగుతుంది: సమంత

29-05-2020 Fri 18:50
  • అందుకే ద్వేషించేవారిని స్ఫూర్తిగా తీసుకుంటానన్న సమంత
  • వారి విమర్శలే తనకు ప్రోత్సాహాన్నిస్తాయని వెల్లడి
  • అభిమానులతో సామ్ లైవ్ చాట్
Samantha comes in live for fans

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అందాల భామ సమంత అభిమానులతో ట్విట్టర్ లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెను తమ ప్రశ్నల వర్షంలో ముంచెత్తారు. అయితే కొన్ని ప్రశ్నలకే ఆమె స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రశంసలు ఎక్కువగా లభిస్తే తనలో బద్ధకం పెరిగిపోతుందని అన్నారు.

అందుకే ద్వేషించేవారినే స్ఫూర్తిగా తీసుకుంటానని, వారి విమర్శలు, అవహేళనలే తనను ప్రోత్సహిస్తుంటాయని వివరించారు. అందుకే నన్ను ద్వేషించే వారికి థ్యాంక్స్ అంటూ వ్యాఖ్యానించారు. అభిమానుల గురించి చెబుతూ, వారి ప్రేమను తాను పొందగలిగానన్న భావనతో సంతోషపడుతుంటానని వెల్లడించారు. తన అత్తగారు అమల గురించి చూడా సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమల తన స్నేహితురాలు, మార్గదర్శి అని చెప్పడం ద్వారా ఆమెకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు.