ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో!: చంద్రబాబు

29-05-2020 Fri 18:37
  • సీఎం జగన్ ఏడాది పాలనపై చంద్రబాబు స్పందన
  • అనేక ఘటనలతో వీడియో రూపకల్పన
  • హతవిధీ అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు
Chandrababu responds on CM Jagan one year completion

సీఎం జగన్ ఏడాది పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జగన్ పాలనలో జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఎన్నికల ముందు జగన్ హామీలు ఇచ్చిన వైనం, ఒక్క చాన్స్ అంటూ ప్రజలను కోరడం ఈ వీడియో చూడొచ్చు.

అంతేకాదు, ఇటీవల వైజాగ్ లో జరిగిన డాక్టర్ సుధాకర్ ఘటన కూడా పొందుపరిచారు. అనేక పథకాలకు వైఎస్సార్ పేరు తగిలించి కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారని, అన్న క్యాంటీన్లు మూతపడ్డాయని ఈ వీడియోలో ఆరోపించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలంలో ఇంకెంత బెంబెలెత్తిస్తారో కదా, హతవిధీ! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.