కరోనా శాంపిళ్లను తీసుకెళ్లి చెట్టెక్కిన కోతులు... వీడియో ఇదిగో!

29-05-2020 Fri 18:06
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • ల్యాబ్ టెక్నీషియన్ పై కోతుల దాడి
  • కరోనా శాంపిల్ ను నోటితో పీల్చిన కోతి
  • కోతి చేష్టలు చూసి హడలిపోయిన ప్రజలు
Monkeys taken corona samples and climbed a tree

అసలే కోతులు... ఆపై చేతికేదైనా వస్తువు దొరికితే ఇంకేమన్నా ఉందా! ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అదే జరిగింది. మీరట్ లోని మెడికల్ కాలేజీ వద్ద కరోనా అనుమానితుల శాంపిళ్లను తీసుకెళ్లిన కోతులు చెట్టెక్కాయి. శాంపిళ్లు తీసుకెళుతున్న ల్యాబ్ టెక్నీషియన్ పై కోతిమూక దాడి చేసింది. అతడి నుంచి చేజిక్కించుకున్న శాంపిళ్లతో చెట్టెక్కి చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ భయాందోళనలు కలిగించాయి. వాటిలో ఒక కోతి కరోనా శాంపిల్ ను నోటితో పీల్చడం చూసి ప్రజలు హడలిపోయారు. దీనిపై డాక్టర్లు స్పందిస్తూ, ఆ కోతులకు కూడా కరోనా వస్తుందని చెప్పారు. ఇప్పుడా కోతుల కారణంగా  కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.