Maldives: భారత్ కు వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలన్న పాక్ కుటిల యత్నాలను భగ్నం చేసిన చిన్నదేశాలు

  • పాక్ కుయుక్తులు మరోసారి బట్టబయలు
  • ఇస్లామోఫోబియా పేరిట భారత్ ను ఏకాకిని చేయాలని యత్నం
  • పాక్ యత్నాలకు నో చెప్పిన ఓఐసీ సభ్యదేశాలు
Maldives and UAE refutes Pakistan trials for forming a group against India

పాకిస్థాన్ ఎక్కడైనా గానీ భారత్ కు పక్కలో బల్లెం వంటిదే! తాజాగా, పాక్ కుయుక్తులు ఎలాంటివో మరోసారి బయటపడ్డాయి. ఐక్యరాజ్యసమితిలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ) సభ్యదేశాల రాయబారులతో ఓ ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసేందుకు పాక్ ప్రయత్నించింది. ఇస్లామోఫోబియా పేరిట సభ్య దేశాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే, ఈ ప్రయత్నాన్ని మాల్దీవులు, యూఏఈ గట్టిగా వ్యతిరేకించడమే కాదు, పాక్ కుటిల ప్రయత్నాలను నీరుగార్చాయి. ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓఐసీ దేశాల సమావేశంలో పాక్ ఈ ప్రతిపాదన తీసుకురాగా, మాల్దీవులు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.

దీనిపై ఐక్యరాజ్యసమితిలో మాల్దీవుల శాశ్వత ప్రతినిధి థిల్మీజా హుస్సేన్ ఘాటుగా స్పందించారు. ఇస్లామోఫోబియా పేరిట భారత్ ను ఏకాకిని చేసే ప్రయత్నం వాస్తవికంగా సరికాదని, దక్షిణాసియాలో మత సామరస్యానికి భంగం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకున్నా తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. యూఏఈ కూడా పాక్ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పింది. ఇలాంటి గ్రూపులకు తమ మద్దతు ఉండదని, ఒకవేళ గ్రూపు ఏర్పాటు చేయదలిస్తే అది విదేశాంగ మంత్రుల స్థాయిలో ఉండాలని సూచించింది.

More Telugu News