మహానాడు ముగించుకుని హైదరాబాద్ కు పయనమైన చంద్రబాబు

29-05-2020 Fri 17:27
  • ఇటీవల ఏపీ వచ్చిన చంద్రబాబు
  • వైజాగ్ పర్యటన రద్దు
  • రెండ్రోజుల పాటు మహానాడు నిర్వహణ
Chandrababu returns Hyderabad after conducting Mahanadu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు నెలల అనంతరం ఇటీవలే ఏపీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వైజాగ్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు అనుమతి కూడా తీసుకున్న ఆయన, ఆపై విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో, తన వైజాగ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, గత రెండ్రోజులుగా టీడీపీ మహానాడును డిజిటల్ విధానంలో నిర్వహించారు. మహానాడు ముగియడంతో ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ కు పయనమయ్యారు.