జగన్‌ కు కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా ఫోన్

29-05-2020 Fri 17:22
  • నెలాఖరుతో ముగుస్తున్న లాక్ డౌన్ 4.0
  • రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుంటున్న కేంద్రం
  • కరోనాపై చర్యలు, లాక్ డౌన్ గురించి జగన్ తో చర్చించిన అమిత్ షా
Amit Shah speaks to Jagan by Phone

ఈ నెలాఖరుతో లాక్ డౌన్ 4.0 ముగుస్తోంది. మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో, ఇంతటితో లాక్ డౌన్ కు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలుకుతుందా? లేక లాక్ డౌన్ 5.0ను ప్రకటిస్తుందా? అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.

ఈ నేపథ్యంలో, లాక్ డౌన్ కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అమిత్ షాకు జగన్ వివరించారు.