ఏపీలో కొత్తగా 33 కరోనా కేసులు... కర్నూలులో ఒకరి మృతి

29-05-2020 Fri 17:02
  • గత 24 గంటల్లో 11,638 శాంపిల్స్ పరీక్ష
  • ఆరుగురికి కోయంబేడుతో లింకు
  • ఇవాళ 79 మంది డిశ్చార్జి
Thirty three new cases surfaced in AP

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,638 నమూనాలు పరీక్షించగా, 33 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,874కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వాటిలో 6 కేసులకు కోయంబేడు లింకు ఉన్నట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 2 కేసులు వెలుగుచూశాయి. ఇవాళ 79 మంది డిశ్చార్జి కావడంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,037కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 777 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, గడచిన 24 గంటల్లో కర్నూలులో ఒక కరోనా మరణం సంభవించింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 60 మంది కరోనాతో మృత్యువాత పడినట్టు అధికారిక బులెటిన్ లో పేర్కొన్నారు.