సైబరాబాద్ సీపీ సజ్జనార్ తో పూనమ్ కౌర్ సెల్ఫీ

29-05-2020 Fri 16:30
  • సైబరాబాద్ పోలీసులకు 100 మాస్కులు అందించిన పూనమ్
  • సజ్జనార్ కు చిత్రపటం బహూకరణ
  • పోలీసులంటే గౌరవం రెట్టింపయ్యిందని ట్వీట్
Poonam Kaur meets Cyberabad commissioner VC Sajjanar

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సైబరాబాద్ పోలీసులకు 100 ప్రత్యేకమైన మాస్కులను బహూకరించారు. ఇవాళ పూనమ్ కౌర్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లి సీపీ సజ్జనార్ ను కలిశారు. ప్రత్యేకంగా రూపొందించిన మాస్కులు అందజేసిన అనంతరం సజ్జనార్ కు సిక్కుల మతగురువు గురు గోవింద సింగ్ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు.

అనంతరం ఆమె ట్విట్టర్ లో స్పందించారు. పోలీసులను గౌరవించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. తాను చిత్రపటాన్ని అందిస్తున్న సమయంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ బూట్లు తీసేసి ఎంతో భక్తిభావం ప్రదర్శించారని, అది భారతీయ సంస్కృతికి నిదర్శనం అని పూనమ్ కౌర్ కొనియాడారు. ఈ ఘటనతో పోలీస్ అంటే గౌరవం రెట్టింపైందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సజ్జనార్ తో ఆమె సెల్ఫీ తీసుకుంది.