బాలకృష్ణను ఆహ్వానించాల్సిన బాధ్యత 'మా'దేనని సి. కల్యాణ్ వ్యాఖ్యానించడం దారుణం: నరేశ్

29-05-2020 Fri 15:47
  • టాలీవుడ్ లో మరో వివాదం
  • సీఎం కేసీఆర్ తో సినీ ప్రముఖుల సమావేశం
  • తనను పిలవకపోవడంపై బాలయ్య కినుక!
Naresh reacts over C Kalyan comments in Balayya row

కరోనా సంక్షోభం నేపథ్యంలో టాలీవుడ్ లో దుమారం రేగింది. సీఎం కేసీఆర్ తో సమావేశానికి నందమూరి బాలకృష్ణను పిలవకపోవడం వివాదాస్పదమైంది. మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య సమావేశానికి వెళ్లిన సినీ ప్రముఖులనుద్దేశించి వ్యాఖ్యానించారు. తనను సమావేశానికి పిలవకపోవడంపై ఆయన పైవిధంగా స్పందించారు. దీనిపై నిర్మాత సి.కల్యాణ్ స్పందిస్తూ, బాలకృష్ణను ఈ సమావేశానికి ఆహ్వానించాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)దేనని అన్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలను మా అధ్యక్షుడు నరేశ్ ఖండించారు. బాలయ్యను పిలవాల్సింది 'మా'నే అంటూ సి.కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. మా అధ్యక్షుడి హోదాలో ఉన్న తనకు ఈ సమావేశాలు జరుగుతున్న సంగతే తెలియదని, తనకే కాదు, మా ప్రధాన కార్యదర్శికి కూడా ఈ విషయం తెలియదని, తమకే తెలియనప్పుడు మరొకరిని ఈ సమావేశాలకు ఎలా ఆహ్వానిస్తామని నరేశ్ ట్వీట్ చేశారు.