Thammareddy Bharadwaja: బాలకృష్ణ లేకుండా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది?: తమ్మారెడ్డి భరద్వాజ

There is no industry without Balakrishna says Thammareddy
  • అవసరాన్ని బట్టి మీటింగ్ కు కొందరిని పిలిచారు
  • ఈ సమావేశాలు కేవలం ఇండస్ట్రీ కోసమే
  • రియలెస్టేట్ చేసేవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు
చిరంజీవి నివాసంలో ఈరోజు సీసీసీ మీటింగ్ జరిగింది. షూటింగులను ప్రారంభించడం, సినీ కార్మికులకు రెండో విడత సాయం వంటి అంశాలపై సినీ ప్రముఖులు ఈ సమావేశంలో చర్చించారు. మీటింగ్ అనంతరం మీడియాతో తమ్మారెడ్డి మాట్లాడుతూ, మరోసారి సమావేశమవుతామని చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణ, నాగబాబు వివాదంపై మీడియా ప్రశ్నించగా... గత సమావేశానికి బాలకృష్ణను పిలవాలని అన్నారు. బాలకృష్ణ లేకుండా ఇండస్ట్రీ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రియలెస్టేట్ వ్యాపారాలు చేసుకునే వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని చెప్పారు. ఈ సమావేశాలన్నీ కేవలం పరిశ్రమ కోసమేనని అన్నారు.

అవసరాన్ని బట్టి మీటింగ్ కు కొందరిని పిలిచారని తమ్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమావేశం కాబట్టి... లీడ్ తీసుకోమని కొందరి పేర్లను వారే సూచించి ఉండొచ్చని తెలిపారు. జరిగిన దాంట్లో ఎలాంటి వివాదం లేదని చెప్పారు.
Thammareddy Bharadwaja
Balakrishna
Nagababu
Tollywood

More Telugu News