Pawan Kalyan: శ్రీమతి సుహారిక మృతి కలచివేసింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan express grief towards Kanna daughter in law sudden death
  • కన్నా లక్ష్మీనారాయణ కోడలు హఠాన్మరణం
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • సుహారిక భర్త ఫణీంద్రకు ఇది ఊహించని విపత్తు  
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన కోడలు సుహారిక హఠాన్మరణం చెందారు. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారి కోడలు సుహారిక మృతి కలచివేసిందని పేర్కొన్నారు.

చిన్నవయసులోనే ఆమె మరణించడం బాధాకరమని, అప్పటివరకు స్నేహితులతో ఉత్సాహంగా గడిపి ఉన్నట్టుండి కుప్పకూలిపోయి ప్రాణాలు విడవడం దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడించారు. ఈ ఘటన కన్నా గారి కుటుంబానికి, ముఖ్యంగా సుహారిక భర్త ఫణీంద్రకు ఊహించని విపత్తు వంటిదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ విషాదం నుంచి కన్నా లక్ష్మీనారాయణ, ఫణీంద్ర, ఇతర కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సుహారిక మృతికి తన తరఫున, జనసేన తరఫున సంతాపం వ్యక్తం చేశారు.
Pawan Kalyan
Suharika
Kanna Lakshminarayana
Sudden Death

More Telugu News