ఇప్పటికైనా తప్పు తెలుసుకుని కోర్టు తీర్పును గౌరవించాలి: సుజనా చౌదరి

29-05-2020 Fri 15:14
  • ఎస్ఈసీగా నిమ్మగడ్డ కొనసాగవచ్చన్న హైకోర్టు
  • హైకోర్టు తీర్పు హర్షణీయమన్న సుజనా
  • ప్రజాస్వామ్యంపై నమ్మకం నిలబెట్టిన తీర్పు అంటూ వ్యాఖ్యలు
BJP MP Sujana Chowdary responds on high court verdict

ఎస్ఈసీ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొనసాగవచ్చంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల సుజనా హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని హైకోర్టు తీర్పు నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. ఏపీ సర్కారు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని కోర్టు తీర్పును గౌరవించాలని సుజనా హితవు పలికారు.