జగన్ వల్ల అధికారులు కోర్టు బోనుల్లో నిలబడుతున్నారు: బుచ్చయ్య చౌదరి

29-05-2020 Fri 15:05
  • వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 58 కోర్టు తీర్పులు వచ్చాయి
  • సీఎంగా కొనసాగే అర్హత జగన్ కు లేదు
  • జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వెంటనే పూర్తి చేయాలి
Officers are standing in court bones due to Jagan says Gorantla

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు 58 కోర్టు తీర్పులు వచ్చాయని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ అంశానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పారు.

ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగే అర్హత జగన్ కు లేదని... ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ నియంతృత్వ పోకడల వల్ల అధికారులు కోర్టు బోనుల్లో నిలబడాల్సి వస్తోందని చెప్పారు. జగన్ అక్రమాస్తుల కేసు ఎనిమిదేళ్లుగా వాయిదా పడుతూ వస్తోందని... కేసు విచారణను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.