హైకోర్టు తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది: పవన్ కల్యాణ్

29-05-2020 Fri 12:21
  • ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్సు రద్దయింది
  • ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది
  • ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
pawan on high court verdict

ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసిన విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది' అని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శల జల్లు కురిపిస్తున్నారు.