కడప శివారులోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

29-05-2020 Fri 08:36
  • నగర శివారులోని బుడ్డాయపల్లిలో ఘటన
  • రూ. 85 లక్షల వరకు ఆస్తినష్టం
  • షార్ట్ సర్క్యూటే కారణం?
Fire Accident In Chemical Factory In Kadapa dist

కడప శివారులోని బుడ్డాయపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో రూ. 85 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.