సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

29-05-2020 Fri 07:34
  • అది నిర్మాతల ఇష్టమంటున్న రకుల్!
  • దసరాకి వస్తున్న సాయితేజ్ సినిమా
  • శ్రీలంక నేపథ్యంలో విజయ్ సేతుపతి
  • మళ్లీ వస్తున్న కామ్న జెత్మలానీ
Rakul about releasing films on OTT platform

*  సినిమాను ఏ విధంగా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాతల ఇష్టమని చెబుతోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. 'లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడడంతో కొందరు ఓటీటీ ప్లేయర్స్ ద్వారా తమ సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది పూర్తిగా నిర్మాతల అభీష్టం మేరకే జరగాలి. సినిమాపై పెట్టుబడి పెట్టేది నిర్మాత కాబట్టి, తన చిత్రాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలనేది కూడా అతని ఇష్టప్రకారమే జరగాలి. అందుకే నేను నటించిన చిత్రాలను ఏ ప్లాట్ ఫామ్ పై రిలీజ్ చేసినా నాకు అభ్యంతరం లేదు' అని చెప్పింది రకుల్.
*  మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ్ నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటరు' చిత్రాన్ని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అసలు ఏప్రిల్ లోనే విడుదల చేయాలనుకున్నారు. అయితే, లాక్ డౌన్ వల్ల షెడ్యూల్స్ అప్ సెట్ అయ్యాయి.
*  తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన తమిళ నటుడు విజయ్ సేతుపతి తాజా చిత్రం శ్రీలంక నేపథ్యంలో సాగుతుంది. వెంకట కృష్ణ రఘునాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తుంది.    
*  గతంలో పలు చిత్రాలలో కథానాయికగా నటించిన కామ్న జెత్మలానీ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ కి వస్తోంది. ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన కామ్న తాజాగా తెలుగులో ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. నూతన దర్శకుడు ప్రభు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనుంది.