ఆధార్ తో మొబైల్ లింక్ అయ్యుంటే చిటికెలో 'పాన్'!

28-05-2020 Thu 19:21
  • ఈ-పాన్ సౌకర్యం ప్రారంభించిన కేంద్రం
  • ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా అమలు
  • పూర్తి ఎలక్ట్రానిక్ విధానంతో పాన్ మంజూరు
Centre starts easy and quick PAN

గతంలో పాన్ నెంబరు కోసం వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు. కేంద్రం ఈ-పాన్ పేరిట సత్వర శాశ్వత ఖాతా నెంబరును మంజూరు చేస్తోంది. ఇప్పుడా పథకానికి మరింత మెరుగులు దిద్దుతూ మరింత త్వరితగతిన పాన్ పొందే సౌలభ్యం తీసుకువచ్చింది. మీకు ఆధార్ కార్డు ఉండి, ఆ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబరు లింక్ అయ్యుంటే చాలు... క్షణాల్లో పాన్ నెంబరు జారీ అవుతుంది. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానం. ఇప్పటివరకు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసిన కేంద్రం, ప్రస్తుతం అధికారికంగా ప్రారంభించింది.