బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందన

28-05-2020 Thu 19:17
  • బాలయ్య అలా ఎందుకు అన్నారో తెలియదు
  • ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను
  • యాక్టివ్ గా ఉన్న వారందరినీ సమావేశానికి పిలిచాము
Minister Talasani response on Balakrishna reaction

తెలంగాణ ప్రభుత్వంతో సినీ ప్రముఖులు జరిపిన చర్చలకు తనను పిలవలేదని చెబుతూ... మంత్రి తలసానితో కూర్చుని భూములు పంచుకున్నారా? అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నాయి.

 ఈ వ్యాఖ్యలపై తలసాని స్పందిస్తూ, బాలకృష్ణ అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదని అన్నారు. చర్చలకు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు, నిర్మాతలు, దర్శకులు వచ్చారని... సినిమా, టీవీ షూటింగులకు సంబంధించే ఆ సమావేశంలో చర్చించామని చెప్పారు.

ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న వారిని సమావేశానికి పిలిచామని తెలిపారు. ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి సమావేశం పెట్టమన్నా తనకు అభ్యంతరం లేదని అన్నారు. బాలయ్య వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించనని... అలా ఎందుకు అన్నారో కనుక్కుని మాట్లాడతానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని విషయాలను వివరిస్తామని తెలిపారు.