ముఖ్యమంత్రి గారూ... దేనికండీ మీ సమీక్ష?: వర్ల రామయ్య

28-05-2020 Thu 18:52
  • సీఎంను సూటిగా ప్రశ్నించిన వర్ల రాయయ్య
  • కనీసం 10 కిమీ సిమెంట్ రోడ్డు వేశారా అంటూ నిలదీసిన వర్ల
  • ఏదైనా సిమెంట్ కట్టడి నిర్మించారా? అంటూ ట్వీట్
Varla Ramaiah questions AP CM Jagan over official reviews

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు. సీఎం గారూ, మీ ఏడాది పాలనలో కనీసం 10 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వేశారా? లేక, ఏదైనా సిమెంట్ కట్టడం నిర్మించారా? ఏ ఒక్క దళితుడికి గానీ, గిరిజనుడికి గానీ ఆర్థిక సాయం అందించారా? ఒక్క ఇన్నోవా కారు కానీ, టిప్పర్ కానీ, ప్రొక్లైనర్ కానీ, ఆటో కానీ ఇచ్చారా? అంటూ నిలదీశారు. దేని కోసం సమీక్ష?  అంటూ విమర్శించారు.