Nagarjuna: మాతోనే కాదు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారితో మాట్లాడారు: తలసానిపై నాగ్ ప్రశంసలు

Nagarjuna praised Talasani for his effort to help thousands of cine and television industry workers
  • 14 వేల మంది కార్మికులకు తలసాని సాయం
  • అన్నపూర్ణ స్టూడియోస్ లో నిత్యావసరాల పంపిణీ
  • చిత్రసీమకు, ప్రభుత్వానికి తలసాని వారధిలా నిలిచారన్న నాగార్జున
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 14 వేల మంది సినీ, టీవీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. తలసాని సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్ లో షురూ అయింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ సమస్యలపైనా, కార్మికుల వెతలపైనా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపించిన చొరవ ప్రశంసనీయం అని పేర్కొన్నారు. తలసాని తమతోనే కాకుండా, చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాల వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారని నాగ్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య ఒక వారధిలా నిలిచారని, అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా నాగ్ సీఎం కేసీఆర్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు.
Nagarjuna
Talasani
Tollywood
Television
Workers
Essentials
Annapurna Studios

More Telugu News