Lockdown: మహిళల మేకప్: కరోనా కారణంగా ఏ సేల్స్ పెరిగాయి? ఏ సేల్స్ దారుణంగా పడిపోయాయి?

  • పడిపోయిన లిప్ స్టిక్ వినియోగం
  • మాస్కుల కారణంగా లిప్ స్టిక్ వేసుకోని మహిళలు
  • పెరిగిన ఐ మేకప్ కు సంబంధించిన కొనుగోళ్లు
Lip stick sales effected due to lockdown

లాక్ డౌన్ ప్రభావంతో మహిళలు వాడే పలు సౌందర్య సాధనాలు మెరుపును కోల్పోయాయి. వాస్తవానికి ఎలాంటి మాంద్యం సమయంలోనైనా వీటి డిమాండ్ తగ్గే అవకాశం ఉండదు. కానీ, కరోనా ప్రభావంతో అందరూ ఇంటి పట్టునే ఉండటం, బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాల్సి రావడంతో... లిప్ స్టిక్ ల సేల్స్ పడిపోయాయి. ఇదే సమయంలో 'ఐ మేకప్స్ (కంటి సౌందర్యానికి వాడేవి)' కొనుగోళ్లు మాత్రం పెరుగుతున్నాయి. కార్యాలయాల్లో సైతం మాస్కులు ధరించాలనే నిబంధన ఉండటంతో... మహిళలు లిప్ స్టిక్ వాడకాన్ని తగ్గిస్తున్నారు.

ఈ సందర్బంగా ప్రముఖ కాస్మొటిక్స్ కంపెనీ లోరియల్ ఇండియా డైరెక్టర్ కవిత ఆంగ్రే మాట్లాడుతూ, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారని... దీంతో లిప్ స్టిక్ కు డిమాండ్ పడిపోయిందని చెప్పారు. అఫీషియల్ వీడియో ప్రజెంటేషన్ లో కనిపించాల్సి వచ్చినప్పుడే లిప్ స్టిక్ వేసుకుంటున్నారని అన్నారు.

హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, లాక్ డౌన్ కారణంగా కొనుగోళ్లు తగ్గాయని... మార్కెట్ పూర్తి స్థాయిలో తెరుచుకున్న వెంటనే అన్నీ పూర్వ స్థితికి వస్తాయని భావిస్తున్నామని చెప్పారు.

More Telugu News