లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన స్వయం ప్రకటిత దేవుడు అరెస్ట్! 

28-05-2020 Thu 16:50
  • దక్షిణ ఢిల్లీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన దాటి మహారాజ్
  • కార్యక్రమం సందర్భంగా లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన
  • విచారణ తర్వాత బెయిల్ పై విడుదల
Godman Daati Maharaj arrested for violating coronavirus

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన స్వయం ప్రకటిత దేవుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న దాటి మహారాజ్ దక్షిణ ఢిల్లీలో ఓ ఆలయంలో మత పరమైన ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మహారాజ్ ను కొన్ని గంటల సేపు విచారించిన తర్వాత ఆయనకు బెయిల్ ఇచ్చినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాటి మహరాజ్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది దాటి మహారాజ్ అని తేలింది. దీంతో, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.