ఈ రోజూ దూకుడే.. మరోసారి 32 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్!

28-05-2020 Thu 16:30
  • 595 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 175 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా పెరిగిన ఎల్ అండ్ టీ
Sensex crosses 32k mark

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా మంచి లాభాలను మూటగట్టుకున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలో సూచీలు లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ మరోసారి 32 వేల మార్కును అధిగమించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 595 పాయింట్లు లాభపడి 32,201కి ఎగబాకింది. నిఫ్టీ 175 పాయింట్లు పెరిగి 9,490కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (6.17), హీరో మోటో కార్ప్ (5.52), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.95), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (4.56), మారుతి సుజుకి (4.37).

టాప్ లూజర్స్:
ఐటీసీ (0.83), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.19), భారతి ఎయిర్ టెల్ (0.05).