'సర్కార్ వారి పాట' కథపై ఊహాగానాలు!

28-05-2020 Thu 16:23
  • పరశురాం దర్శకత్వంలో మహేశ్ సినిమా 
  • టైటిల్ గా 'సర్కార్ వారి పాట' నిర్ణయం
  • సామాజిక, రాజకీయ అంశాలతో కథ?
Backdrop of Mahesh film is discussed

మహేశ్ బాబు చిత్రం టైటిల్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది.
పరశురాం దర్శకత్వంలో మహేశ్ నటించే చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే పేరును నిర్ణయించారంటూ నిన్న ఒక్కసారిగా మీడియాలో వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఈ టైటిల్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనిని బట్టి ఈ సినిమా కథ ఎటువంటిదన్న దానిపై ఊహాగానాలు వెలువడుతున్నాయి.

గతంలో 'భరత్ అనే నేను', 'మహర్షి' చిత్రాలలో మహేశ్ సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలను టచ్ చేశాడు. అవి ప్రజలలోకి బాగా దూసుకుపోయాయి కూడా. ఇప్పుడు ఈ టైటిల్ని బట్టి చూస్తే ఇది కూడా అటువంటి సామాజిక సమస్య ఇతివృత్తంతోనే రూపొందే అవకాశం వుందని అంటున్నారు. ముఖ్యంగా బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో కొందరు రుణాలు తీసుకుని ఎగ్గొట్టడాలు.. అనంతరం విదేశాలకు చెక్కేయడం, వారి ఆస్తులు వేలానికి రావడం.. వంటి అంశాలను ఇందులో స్పృశించవచ్చని భావిస్తున్నారు. ఏమైనా, ఈ టైటిల్ మాత్రం అందర్నీ ఆలోచింపజేస్తోంది.