ఎన్టీఆర్ పక్కన ఎంతో అణకువగా వెంకటేశ్.. ఫొటో ఇదిగో!

28-05-2020 Thu 16:16
  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • తన ట్విట్టర్ ఖాతాలో ఫొటో పంచుకున్న వెంకీ
  • మదిలో నిలిచిపోయే క్షణాలు అంటూ వ్యాఖ్య
Hero Venkatesh shares a photo of NTR

ఇవాళ మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనతో తమ చిరస్మరణీయ క్షణాలను స్మరించుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్రహీరో వెంకటేశ్ కూడా ఎన్టీఆర్ తో కలిసున్న ఓ ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో వెంకటేశ్ ఎంతో వినయంగా ఎన్టీఆర్ పక్కన నిలుచుని ఉండడం చూడొచ్చు. దీనిపై వెంకీ ట్విట్టర్ లో స్పందించారు. మదిలో నిలిచిపోయే క్షణాలు అంటూ వ్యాఖ్యానించారు. దిగ్గజం ఎన్టీఆర్ ను ఆయన జయంతి నాడు స్మరించుకుంటున్నట్టు పేర్కొన్నారు.