ఐదేళ్ల కంటే ముందే అధికారంలోకి వస్తామన్న బాలయ్య... ఎప్పటికీ రాలేరన్న మోపిదేవి!

28-05-2020 Thu 15:42
  • త్వరలోనే టీడీపీకి అధికారం అంటూ బాలయ్య వ్యాఖ్యలు
  • ఐదేళ్లు కూడా అక్కర్లేదని వెల్లడి
  • బాలకృష్ణ ఎప్పటికీ సీఎం కాలేడన్న మోపిదేవి
Balakrishna comments on power and Mopidevi reacted immediately

టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆఖరి రక్తపు చుక్క వరకు కార్యకర్తల కోసం పాటుపడతానని స్పష్టం చేశారు. ఐదేళ్ల కంటే ముందే అధికారంలోకి వస్తామని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు.

"ఐదేళ్లు కూడా అక్కర్లేదు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ త్వరలోనే అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో అసలు యంత్రాంగం నడుస్తోందా? లేదా? అనే సందేహం ప్రజల్లో నెలకొంది" అంటూ వ్యాఖ్యానించారు.

కాగా, బాలకృష్ణ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి, వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ వెంటనే స్పందించారు. సీఎం అవ్వాలన్నది బాలకృష్ణ కల అని, అది ఎప్పటికీ నెరవేరదని అన్నారు. అంతేకాదు, టీడీపీ శ్రేణులు కూడా మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నట్టుందని, అది జరగని పని అని స్పష్టం చేశారు.