జిల్లాలకు వెళ్లాలంటే జగన్ అనుమతి కావాలా?: చంద్రబాబు

28-05-2020 Thu 15:12
  • ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందన్న చంద్రబాబు
  • ప్రశ్నిస్తే తమపైనే కేసులు పెడుతున్నారని వెల్లడి
  • వైసీపీ అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తామని వ్యాఖ్యలు
Chnadrabu slams CM Jagan in TDP Mahanadu

టీడీపీ మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాజా పరిణామాలపై స్పందించారు. జిల్లాలకు వెళ్లాలంటే జగన్ అనుమతి కావాలా? అంటూ మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, ఇదేంటని ప్రశ్నిస్తే తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న తటస్థులపైనా వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక వైసీపీ అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ప్రజల బాగోగులు పట్టించుకోవడం మానేసి, పగ సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.