ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కియా కీలక ప్రకటన

28-05-2020 Thu 14:59
  • మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న కియా
  • 'మన పాలన - మీ సూచన' కార్యక్రమంలో ప్రకటన
  • ఏపీతో బలమైన అనుబంధం ఉందని వ్యాఖ్య
KIA Motors expanding activities in AP plant

ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా మోటార్స్ ప్రకటించింది. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ తెలిపారు 'మన పాలన - మీ సూచన' కార్యక్రమం సందర్భంగా  పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చేశారు. ఏపీతో కియా మోటార్స్ కు బలమైన బంధం ఉందని చెప్పారు.