జబర్దస్త్ కమెడియన్ రాఘవకు హోమ్ క్వారంటైన్

28-05-2020 Thu 14:59
  • ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన కమెడియన్ రాఘవ
  • సరిహద్దులో కరోనా వైద్య పరీక్షలు
  • నెగెటివ్ రావడంతో హోం క్వారంటైన్ సరిపోతుందన్న వైద్యులు
Home quarantine for Cine and Jabardast artist Raghava

అనేక తెలుగు చిత్రాల్లో నటించిన కమెడియన్ రాఘవ ఆపై జబర్దస్త్ ద్వారా మరింత ప్రజాదరణ పొందాడు. ప్రస్తుతం రాఘవకు తెలంగాణ అధికారులు హోమ్ క్వారంటైన్ విధించారు. రాఘవ ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దు ప్రాంతాల్లో కరోనా స్క్రీనింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాఘవకు కూడా తెలంగాణ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అతనిలో కరోనా లక్షణాలు కనిపించలేదని ఓ వైద్యుడు తెలిపారు. దాంతో చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేసి పంపించినట్టు వెల్లడించారు.