ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ను మరోసారి తెరపైకి తెచ్చిన టీడీపీ

28-05-2020 Thu 14:42
  • మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
  • ఎన్టీఆర్ కు భారతరత్న కోసం టీడీపీ కృషి చేస్తోందన్న చంద్రబాబు
  • ఎన్టీఆర్ ఓ వ్యవస్థ అని అభివర్ణన
TDP demands Bharata Ratna for NTR

తెలుగు జాతి కీర్తిని దేశ సరిహద్దుల ఆవలకు సైతం వ్యాపింపచేసిన మహానుభావుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందేనని టీడీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

అసలు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలన్న డిమాండ్లు ఇప్పటివి కావు. ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడులో ఈ అంశం చర్చకు రాగా, అందరూ డిమాండ్ ను బలపరిచారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఓ వ్యవస్థ అని, ఆయనకు భారతరత్న కోసం టీడీపీ కృషి చేస్తోందని తెలిపారు. సేవాభావానికి ప్రతీకగా నిలవడం ద్వారా ఎన్టీఆర్ అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడన్నారు.