Centre: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర పర్యావరణ శాఖ

Centre files affidavit in LG Polymers case
షార్ట్స్‌లో చూడండి
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పరిశ్రమలో ఉత్పత్తుల ప్రారంభానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అఫిడవిట్ లో పేర్కొంది. రెండేళ్ల క్రితమే అనుమతి నిరాకరించామని వెల్లడించింది. దీనిపై స్పందించిన హైకోర్టు, మిగతా ప్రతివాదులు కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
Go Back to Shorts
Centre
LG Polymers
AP High Court
Vizag Gas Leak
Vizag

More Telugu News