'ఎంత సక్కగ రాశారో' అంటూ గేయ రచయిత చంద్రబోస్‌పై దేవిశ్రీ ప్రసాద్ పాట!

28-05-2020 Thu 13:38
  • చంద్రబోస్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25  ఏళ్లు
  • ఆయనకు దేవిశ్రీ అభినందనలు
  • రంగస్థలం సినిమాలో ఎంత సక్కగున్నావే పాట రాసిన చంద్రబోస్
  • ఆ ట్యూన్‌లోనే చంద్రబోస్‌పై దేవిశ్రీ పాట
dsp about chandrabose

సినీగేయ రచయిత చంద్రబోస్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై ఓ పాటను దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి ఆయనకు అభినందనలు తెలిపాడు. రామ్ చరణ్, సమంతల రంగస్థలం సినిమా కోసం చంద్రబోస్ ఎంత సక్కగున్నావే పాట రాసిన విషయం తెలిసిందే. ఆ ట్యూన్‌లోనే చంద్రబోస్‌పై 'ఎంత సక్కగ రాశారో' అంటూ దేవిశ్రీ పాట పాడారు.  

ఈ పాట అభిమానులను అలరిస్తోంది. కాగా, 1995లో వచ్చిన తాజ్ మహల్ సినిమాకు తొలిసారి సాహిత్యం అందించిన చంద్రబోస్ అప్పటి నుంచి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనేక అద్భుత పాటలను రాశారు.