ముగ్గురుకి కరోనా అంటించిన సిగరెట్!

28-05-2020 Thu 13:23
  • షాద్ నగర్ లో ఘటన
  • సిగరెట్ ను షేర్ చేసుకున్న స్నేహితులు
  • ముగ్గురు క్వారంటైన్ కు తరలింపు
3 friends shared cigarette tests corona positive

కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి రకరకాలుగా విస్తరిస్తోంది. తాజాగా అలాంటి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కరోనా విస్తరణకు ఒక సిగరెట్ కారణమయింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ జియాగూడలో కరోనా వచ్చిన వారి అంత్యక్రియలకు వెళ్లొచ్చాడు. షాద్ నగర్ కు తిరిగొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి సిగరెట్ తాగాడు. ముగ్గురు స్నేహితులు ఒకే సిగరెట్ ను షేర్ చేసుకోవడంతో... ముగ్గురికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ముగ్గురినీ క్వారంటైన్ కు తరలించారు. మరోవైపు షాద్ నగర్ లో ఇప్పటికే కరోనా కేసులు 7కు చేరుకున్నాయి.