sanitizer: శానిటైజర్లను విపరీతంగా వాడితే ప్రమాదమే .. హెచ్చరిస్తున్న వైద్యులు

  • శానిటైజర్ల వల్ల మంచి బ్యాక్టీరియా చనిపోయే ప్రమాదం
  • దాంతో రోగాల బారిన పడే అవకాశం
  • చేతులపై దుమ్ము బాగా ఉన్నప్పుడు శానిటైజర్‌ను‌ ఉపయోగించొద్దు
sanitizer use

కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తుండడంతో చాలా మంది శానిటైజర్లను విపరీతంగా వాడేస్తున్నారు. పదే పదే వాటితో చేతులు కడుక్కుంటున్నారు. అయితే, శానిటైజర్లు  కరోనా వంటి వైరస్‌లను చంపేయడానికి ఉపయోగపడుతున్నప్పటికీ విపరీతంగా వాడితే నష్టాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

శానిటైజర్ల వల్ల అరచేతుల్లోని చెడ్డ బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుందని చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే రోగాల బారిన పడతామని అంటున్నారు. సబ్బుతో చేతులు కడుక్కునే పరిస్థితులు ఉంటే శానిటైజర్‌ వాడకానికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.

మన చేతులపై దుమ్ము బాగా ఉన్నప్పుడు శానిటైజర్‌ను‌ ఉపయోగించొద్దని చెబుతున్నారు. అలాంటి సమయంలో శానిటైజర్లు క్రిముల్ని చంపలేవని చెబుతున్నారు. కాగా, చిన్న పిల్లలను శానిటైజర్‌కు దూరంగా ఉంచాలని, వాటిని పిల్లలు తాగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

More Telugu News