ఆ రాజ్యాన్ని సాధించిన వాడే పరశురాముడు!: పవన్ కల్యాణ్

28-05-2020 Thu 11:24
  • ఒకరు తెగిస్తేనే జాతి సరైన బాటలోకి
  • ఓ అధికారం తల తెగితేనే ధర్మ స్థాపన
  • ట్విట్టర్ లో పవన్ కల్యాణ్
Pawan Kalyan Remembers Lord Parasuram

"ఒక జాతి సరైన బాటలో నడవాలంటే, ఒక తెలివైనవాడు తెగించాలి. ఒక ధర్మం తిరిగి స్థాపించబడాలంటే, ఒక అధికారం తల తెగిపడాలి... ఒక వారసత్వం నదిలా ప్రవహించాలంటే, ఒక గురువు దీపంలా వెలగాలి. ఒక దేశం ఉద్ధరింపబడాలంటే, ఒక సందేహం యుద్ధం చెయ్యాలి. రాజ్యాన్ని సేవించినవాడు రాముడైతే, ఆ రాజ్యాన్ని సాధించిన వాడే పరశురాముడు" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయింది. పరశురాముడు ప్రజలందరికీ ధైర్యాన్ని, శక్తిని అందించాలని తాను కోరుకుంటున్నానని, గొప్ప దేశమైన భారత ఖ్యాతి తిరిగి నిలవాలని కోరుకుంటున్నానని పవన్ తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.