కేసీఆర్, జగన్‌లపై ప్రశంసల వర్షం కురిపించిన లక్ష్మీపార్వతి

28-05-2020 Thu 10:08
  • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు
  • ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించే వారికి ఆయన ఆశీస్సులు ఉంటాయన్న వైసీపీ నేత
  • ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారంటూ ప్రశంసలు
YCP Leader Laxmiparvathi praises Jagan and KCR

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కేసీఆర్‌లపై వైసీపీ నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికి ఆయన ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ రోజు ఆమె హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లకు దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు దొరికారని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారని ప్రశంసించారు.