ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన బాలయ్య!

28-05-2020 Thu 08:28
  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • నిరాడంబరంగా వేడుకలు
  • ఎన్టీఆర్ ఘాట్ కు పలువురు ప్రముఖులు
Balakrishna Pays Tribute to NTR

దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు లాక్ డౌన్ కారణంగా నిరాడంబరంగా జరుగుతున్న వేళ, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొద్దిసేపటి క్రితం నివాళులు అర్పించారు. బాలకృష్ణతో పాటు రామకృష్ణ, సుహాసిని తదితరులు ఎన్టీఆర్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో తెలుగుదేశం అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.