10 బస్సుల్లో హైదరాబాద్ నుంచి మంగళగిరి చేరుకున్న సచివాలయ ఉద్యోగులు

28-05-2020 Thu 07:37
  • లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఉద్యోగులు
  • లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో విధులకు హాజరు కావాల్సిందిగా సీఎస్ ఆదేశాలు
  • తెలంగాణ ప్రభుత్వ అనుమతితో కదిలిన బస్సులు 
AP Secretariat Employees Reached Mangalagiri

లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు నిన్న మంగళగిరి చేరుకున్నారు. మొత్తం 10 బస్సుల్లో 227 మంది ఉద్యోగులు మంగళగిరికి చేరుకోగా, వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో విధులకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

అలాగే, హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ఏపీకి చేరుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాసిన లేఖకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. వారిని ఏపీకి పంపేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ అనుమతితో మొత్తం 227 మంది ఉద్యోగులు పది బస్సుల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌కు చేరుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, నూతక్కి పీహెచ్‌సీ వైద్యాధికారి శైలజ పర్యవేక్షణలో పది వైద్య బృందాలు వీరికి పరీక్షలు నిర్వహించాయి.