సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

28-05-2020 Thu 07:32
  • హ్యాక్ అయిన పూజ ఇన్ స్టా అకౌంట్ 
  • సుమంత్ 'కపటదారి' అప్ డేట్
  • 'బిచ్చగాడు' సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ  
Pooja Hegdes insta account has been hacked

*  కథానాయిక పూజా హెగ్డే ఇన్ స్టాగ్రాం అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయం గురించి పూజ చెబుతూ, 'నా అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.. కాబట్టి ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోకండి..అలాగే ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో పంచుకోకండి' అంటూ ట్వీట్ చేసింది.
*  అక్కినేని ఫ్యామిలీకి చెందిన సీనియర్ నటుడు సుమంత్ తాజాగా 'కపటదారి' చిత్రంలో నటిస్తున్నాడు. కన్నడలో వచ్చిన 'కావలదారి' చిత్రానికి ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోంది. దీని గురించి సుమంత్ తాజాగా చెబుతూ, 'లాక్ డౌన్ కి ముందే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి' అంటూ పేర్కొన్నాడు.  
*  నాలుగేళ్ల క్రితం వచ్చిన 'బిచ్చగాడు' (తమిళంలో 'పిచ్చైకారన్') అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అంతవరకు సంగీత దర్శకుడిగా వున్న విజయ్ ఆంథోనీని ఈ చిత్రం హీరోగా ప్రేక్షకుల ముందు నిలిపింది. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనిని విజయ్ పూర్తిచేశాడని తెలుస్తోంది.