చినజీయర్ స్వామిని కలిసేందుకు వెళ్లిన కేసీఆర్

27-05-2020 Wed 21:49
  • సుదీర్ఘంగా సాగిన సమావేశం
  • సమావేశం ముగిసిన వెంటనే ముచ్చింతల్‌కు కేసీఆర్
  • వివిధ అంశాలపై చర్చ?
Telangana CM KCR to Meet Chinajeer swamy

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చినజీయర్ స్వామిని కలిసేందుకు ముచ్చింతల్ బయలుదేరారు. ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. సమావేశం ముగిసిన వెంటనే శంషాబాద్‌లోని ముచ్చింతల్ బయలుదేరారు. ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసి వివిధ అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లతోపాటు పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యం తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయిందని కేసీఆర్ తెలిపారు.