సీఎస్ పదవీకాలం పొడిగింపుపై ప్రధాని మోదీకి లేఖ రాసిన జగన్

27-05-2020 Wed 19:35
  • ముగుస్తున్న ఏపీ సీఎస్ పదవీకాలం
  • వచ్చే నెల 30న పదవీ విరమణ
  • పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించాలని జగన్ విన్నపం
Jagan writes letter to Modi requesting extension of CS Neelam Sahni

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని వచ్చే నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. డిసెంబర్ వరకు ఆమెను సీఎస్ గా కొనసాగించాలని లేఖలో విన్నవించారు. మరోవైపు జగన్ విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.