నిరూపించండి.. పదవికి రాజీనామా చేస్తా: అవంతి శ్రీనివాస్

27-05-2020 Wed 18:54
  • చంద్రబాబు మాటలు గురువిందను గుర్తుకు తెస్తున్నాయి
  • ఎందుకు ఓడారో సమీక్ష నిర్వహించుకోవాలి
  • ప్రభుత్వంపై విమర్శలు మానాలి
If you prove that i grabbed land i will resign says Avanthi Srinivas

తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈరోజు మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ విశాఖలో భూములను కబ్జా చేస్తున్నారని... సింహాచలం భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై అవంతి మాట్లాడుతూ, చంద్రబాబు మాటలు గురువింద సామెంతను గుర్తుకు తెస్తున్నాయని అన్నారు. గజం స్థలం కబ్జా చేసినట్టు నిరూపించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయాన్ని మహానాడులో సమీక్ష చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానేసి, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు సహకరించాలని చెప్పారు.