ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన స్థలాలు కేటాయించండి.. సీఎం జగన్ కు సినీ నిర్మాతల మండలి లేఖ

27-05-2020 Wed 18:30
  • స్టూడియోలు, ల్యాబ్స్ కోసం స్థలాలు కేటాయించండి
  • పరిశ్రమ వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి
  • గతంలో మర్రి చెన్నారెడ్డి అన్ని వసతులు కల్పించారు
Tollywood Producers Council writes a letter to Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలుగు సినీ నిర్మాతల మండలి ఈ రోజు లేఖ రాసింది. చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఈమేరకు కోరింది. స్టూడియోలు, ల్యాబ్స్ తో పాటు నిర్మాతలు, నటీనటులు, ఇతర పరిశ్రమ వర్గాలకు ఇళ్ల కోసం స్థలాలను కేటాయించాలని విన్నవించింది. జీవో నంబర్ 45 ద్వారా రాష్ట్రంలో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వ ప్రాంగణాలను ఉచితంగా అందించేందుకు ఆదేశాలిచ్చిన సీఎంకు వారు ధన్యవాదాలు తెలిపారు.

గతంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలకు, ల్యాబ్స్ నిర్మించుకోవడానికి స్థలాలను ఉదారంగా కేటాయించారని చెప్పారు. ఆర్టిస్టులు, నిర్మాతలు, ఇతర వర్గాల కోసం ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారని తెలిపారు. అదే మాదిరి ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి స్థలాలను కేటాయించాలని విన్నవించారు. ఈ మేరకు జగన్ కు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు ప్రసన్న కుమార్, వడ్లపట్ల మోహన్ లేఖ రాశారు.