మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయానికి కరోనా నోటీసు

27-05-2020 Wed 17:55
  • మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు వేడుకలు
  • రెండు రోజుల పాటు కొనసాగనున్న మహానాడు
  • కరోనా చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ
Mangalagiri TDP office receives Covid notice

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కోవిడ్ నోటీసులను జారీ చేశారు. రెవెన్యూ అధికారులు ఈ నోటీసులను అందించారు. మహానాడు జరుగుతున్నందున కార్యాలయలో కరోనా నివారణ చర్యలను తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు.

మంగళగిరి తహసీల్దార్ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ కార్యాలయ సెక్రటరీ రమణకు ఆత్మకూరు వీఆర్వో ఈ నోటీసులు అందించారు. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి మహానాడును ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. టీడీపీ శ్రేణులంతా ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా వీక్షిస్తున్నారు.